హస్తం గూటికి కోనప్ప!
ఆంజనేయులు న్యూస్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: భారాస జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ పార్టీ వీడి కాంగ్రెస్ లొ చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన ఆయన తన ఓటమికి పరోక్షంగా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ-భారాస పొత్తు అంశం తెర మీదకు రావడంతో.. ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని సమాచారం. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన...