సొసైటీ ముసుగులో అక్రమాలెన్నో.

దాదాపు రూ. రెండు కోట్లు మోసగించినట్లు అంచనా ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: కోఆపరేటివ్ సొసైటీ ముసుగులో రైతులకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టిన కేసులో మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో 'ఆర్కే రూరల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' పేరిట ఏర్పాటు చేసిన కార్యాలయం ద్వారా రైతులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామంటూ వారి నుంచి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించినట్లు బజార్హథ్నూర్ చెందిన బాధితుడు ఆదిలాబాద్ టూటౌన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు....