Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 06 February 2024, 8:36 am Posted by : anjudega

పాఠశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

మంచిర్యాల డీఈవో యాదయ్య

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సీబీఎస్ఈ అనుమతి లేకున్నా ఉందంటూ తల్లిదండ్రులను మోసం చేసిన మంచిర్యాలకు సమీపంలోని గద్దెరాగడిలో ఉన్న గ్రీన్ వుడ్ పాఠశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీఈవో యాదయ్య సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ గుర్తింపు లేకపోయినప్పటికీ సీబీఎస్ఈ పేరిట అడ్మిషన్లు తీసుకుని పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేశారన్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదుకు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.