Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 January 2024, 8:44 am Posted by : Anjaneyulu Dega

సర్పంచ్ అవినీతిపై విచారణ జరిపాలి

– బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

– యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ముల్కల్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం, సర్పంచ్ పాత్రపై ఇటీవల కాలంలో పలు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయని, సంబంధిత సర్పంచ్ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. నిధులు దుర్వినియోగంపై ఆధారాలతో కథనాలు రావడం జరిగిందని, దీనిపై డీపీవో కార్యాలయానికి పలు పిర్యాదులు అందాయన్నారు. నిధులు దుర్వినియోగం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు తెలపాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు కలిగిన అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.