Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 January 2024, 7:27 pm Posted by : anjudega

గ్రంథాలయాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలి

జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్ అన్నారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట, దండేపల్లి శాఖ గ్రంథాలయలు, దండేపల్లి మండలంలో 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో శాఖ గ్రంథాలయం నూతన భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు మంచిర్యాల జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎ.వి.ఎన్. రాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పాలనాధికారి మాట్లాడుతూ గ్రంథాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిల్వ ఉన్న చెత్తను తొలగించాలని, విద్యుత్, ఇతరత్రా బిల్లులు బకాయి లేకుండా చూడాలని చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రంథాలయ అధికారులు స్థానికంగా అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని సూచించారు. పాఠకులకు అవసరమైన పత్రికలు, పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.