Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 January 2024, 9:12 pm Posted by : Anjaneyulu Dega

సర్పంచ్ లకు అభినందనలు పొన్నం ప్రభాకర్

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ:  తెలంగాణలో గ్రామ సర్పంచుల పదవీకాలం రేపటితో ముగియనుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందని ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఐదేళ్లుగా సమర్ధవంతంగా పాలించిన సర్పంచ్ లకు అభినందనలు చెప్పారు. గ్రామ సమస్యలను తప్పకుండా అన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.