Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 January 2024, 8:57 am Posted by : Anjaneyulu Dega

అధిక లోడ్ పై టీఎస్ఎండీసీ అధికారుల నిఘా

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు: పీఓ తారక్నాథ్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, చెన్నూరు: ఇసుక రవాణాపై టిఎన్ఎండిసి అధికారులు దృష్టిసారించారు. అధిక లోడ్ తో వెళ్లినా, ఎటువంటి బిల్లులు లేకుండా వెళ్తున్న ఇసుక వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలోని ఇసుక క్వారీల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ ఇసుక రవాణా కు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.ఆటలను కట్టేస్తున్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో గల ఇసుక క్వారీల వద్ద ఇసుక లోడ్ తో వెళ్తున్న లారీలను తనిఖీ చేసి, వే బిల్లులు, వాహన పత్రాలు, లోడ్ కు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆఫీసర్ తరక్నాత్ రెడ్డి మాట్లాడుతూ.అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలలో అధికంగా ఉన్న టన్ను లోడ్కు రూ.2వేల చొప్పున రుసుం విధించడం జరుగుతుంది అని, అదే విధంగా జిరో బిల్తో ఇసుక రవాణా చేస్తే రూ. 50వేలు జరిమానాతో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలలో టీఎస్ఎండిసి అధికారులు, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు.