Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 January 2024, 6:53 am Posted by : Anjaneyulu Dega

నస్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం

ప్రిసైడింగ్ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రిసైడింగ్ అధికారి, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వాడాల రాములు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ ఈసంపల్లి ప్రభాకర్పై అవిశ్వాస తీర్మానం ఉంచిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమీషనర్ రమేష్తో కలిసి నిర్వహించిన సమావేశంలో నస్పూర్ మున్సిపల్ కౌన్సిల్లో 25 మంది కౌన్సిల్ ఉండగా 19 మంది సభ్యులు హాజరు అయ్యారని తెలిపారు. చైర్పర్సన్పై ప్రతిపాదించబడిన అవిశ్వాస తీర్మానంపై సమ్మతి తెలుపుమని కోరగా 19 మంది సభ్యులు సమ్మతి తెలుపడం జరిగిందని, అవిశ్వాసం నెగట్టుకు కావలసి మొత్తం సభ్యులలో 2/3 (17 మంది) సభ్యులు కావలసి ఉండగా 19 మంది సభ్యులు ఓటింగ్ బలపర్చడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యవర్గం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.