Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 December 2023, 11:03 am Posted by : anjudega

శేజల్, చిన్నయ్య అనుచరుల మధ్య అర్దరాత్రి గొడవ.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరిజిన్ డెయిరీ సిఈఓ శేజల్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరుల మధ్య సోమవారం రాత్రి జరిగిన గొడవ బెల్లంపల్లిలో సంచలనంగా మారింది. బెల్లంపల్లి రూరల్ సిఐ రాజ్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శేజల్, ఆదినారాయణలు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంటి వైపు వెళ్లి గొడవ చేశారు. దుర్గం చిన్నయ్యను కులం పేరుతో దూషిస్తుండగా బీమా శంకర్ మరో ఇద్దరు వారికి అడ్డు పడ్డారు. ఈ క్రమంలో వారితో శేజల్, ఆదినారాయణలు గొడవ పడ్డారు. ఒకరినోఒకరు కొట్టుకున్నారు. ఈ గొడవలో శేజల్ కారు అద్దాలు పగిలాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్ల గురజాల పోలీసులు ఇరువురి పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దుర్గం చిన్నయ్య అనుచరుల మీద 307, 427, r/w 34 IPC కేసులు నమోదు చేయగా.. శేజల్, ఆదినారాయణ పై 307 IPC SC/ST చట్టం క్రింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ రాజ్ కుమార్ తెలిపారు.