Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 December 2023, 8:23 am Posted by : Anjaneyulu Dega

ఘనంగా జిల్లా స్థాయి యువజనోత్సవాలు

జిల్లా యువజనుల క్రీడ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవ పోటీలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌.సి.ఎ. ఫంక్షన్‌హాల్‌లో ఘనంగా నిర్వహించామని జిల్లా యువజనుల క్రీడ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ యువజన ఉత్సవాల్లో ఉమ్మడి జిల్లా కళాకారులు పాల్గొని నృత్య, జానపద, ఫొక్, డ్యాన్సులతో ఆలరించి ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశారు. అనంతరం వారికి జెడ్పి సీఈవో నరేందర్, మరియు అంతడుపుల నాగరాజు నుత్య ప్రదర్శనలు చేసిన పిల్లలకు జ్ఞాపకను అందచేసి వారి గురువులకి సన్మానం చేసి అభినందించారు.. ఈ పోటీలలో జిల్లాకు చెందిన యువ కళాకారులకు జానపద నృత్యం, పాట (వ్యక్తిగత, సమూహ విభాగాలలో), లైఫ్‌ స్కిల్స్‌ కాంపోనెంట్‌, ఫొటోగ్రఫీ లలో పోటీలు జరుగుతున్నాయని అనంతరం ఈ పోటీలలో ప్రథమ స్థానం పొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం, సంబంధిత శాఖల అధికారులు, యువజన కళాకారులు. అంతడుపుల నాగరాజు, మరియు న్యాయ నిర్ణేతలు, అన్నం కల్పన (నాట్య గురువు), శంకరి, జోష్ణ చంద్రదథ్, మధు మాస్టర్, యువతరం తిరుపతి, కళాకారులు తదితరులు పాల్గొన్నారు..