Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 December 2023, 5:00 pm Posted by : Anjaneyulu Dega

కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియు

సిఐటియు గెలవాలి-మార్పు రావాలి.

తెలంగాణ సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం రోజున ఎస్ఆర్పిత్రి సెకండ్ షిఫ్ట్ గేట్ మీటింగ్ పిట్ కార్యదర్శి వంగల శ్రీను అధ్యక్షతన నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐటీయు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల రక్షణకై నిరంతరం పోరాడుతు, స్థానికంగా సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న క్వార్టర్లు,  తాగునీరు, రోడ్డు  ఇతర సమస్యల పైన అనునిత్యం పోరాటం చేస్తుంది. కార్మికుల పక్షాన ఉండి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సీఐటీయూ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు భాగ్యరాజ్, బాలాజీ, డివిజన్ నాయకులు శ్రీధర్, సాగర్, రాకేష్, డివిజన్ ఉపాధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..