Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 12 December 2023, 10:33 pm Posted by : Anjaneyulu Dega

నిస్పక్షపాత పద్దతిన పంటకోత ప్రయోగం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వానాకాలంలో సాగైన పంటల ద్వారా దిగుబడులను అంచనా వేయడానికి ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆద్వర్యంలో జిల్లాలో నిస్పక్షపాత పద్ధతిన పంట కోత ప్రయోగం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దండేపల్లి మండలం రోళ్ళపహాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న వానాకాలం 2023-24 పంట కోత ప్రయోగాన్ని జిల్లా వ్యవసాయ అధికారి జి. కల్పన, ముఖ్య ప్రణాళిక అధికారి జి. సత్యంలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంట కోత ప్రయోగములను ఆధారంగా చేసుకొని పంట దిగుబడి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో ఎంపిక చేసిన గ్రామంలో సర్వే నంబర్, పంట పొలాలలో నిర్ణీత కొలతలలో పంట దిగుబడులను పారదర్శకంగా లెక్కించి దాని ద్వారా మండలం, జిల్లాలోని పంటల యొక్క దిగుబడులను అంచనా వేయడం, ప్రాథమిక కార్యకర్త (మండల ప్రణాళిక, గణాంక అధికారి) ద్వారా ప్రయోగం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి తహశిల్దార్, ఉప గణాంక అధికారి బి.రాజేందర్, ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.