సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు

అసలేంటి వివాదం ఆంజనేయులు న్యూస్, నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్ పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం అక్కడికి చేరుకుని...