కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు
ఆంజనేయులు న్యూస్, నారాయణపేట జిల్లా: జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పోలీసుల బందోబస్తుతో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐదుగురు సభ్యుల అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. జిల్లా నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. సంపత్ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య మహాలక్ష్మిని అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఈక్రమంలో...