కౌంటింగ్ సూపర్ వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ సాధారణ ఎన్నికలు-2023లో భాగంగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ అనంతరం డిసెంబర్ 3వ తేదీన చేపట్టనున్న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణలో కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు, సహాయకులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో 003- బెల్లంపల్లి రిటర్నింగ్...