Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 November 2023, 8:40 am Posted by : Anjaneyulu Dega

ఎన్నికల్లో పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: పిల్లలతో ఎన్నికల ప్రచారం, పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే బాల కార్మికుల చట్టం కింద నేరమే. పనిలో పెట్టుకున్న వారిపైన, పంపించిన తల్లిదండ్రులను ముద్దాయిలుగా పరిగణిస్తారు. అదే నిబంధన ప్రస్తుతం ఎన్నికల నియమావళిలో మరింత కఠినతరం చేశారు. పాఠశాలలకు వెళ్లకుండా జెండాలు, ప్లెక్సీలు కట్టడం, గోడ ప్రతులు అంటించడం, ప్రచారంలో పాల్గొనడం వంటివి పనులు చేయిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్వితీయ శ్రేణి నాయకులు చేయించినా తప్పిదం అభ్యర్థి ఖాతాలో పడుతోంది. అభ్యర్థిపై కేసు నమోదు చేస్తారు.