Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 November 2023, 7:59 am Posted by : Anjaneyulu Dega

యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తా

ఎమ్మెల్యేగా గెలిస్తే ఏడాదికి రెండు సార్లు క్రీడా పోటీలు నిర్వహించి వివిధ రంగాల్లో యువత రాణించేలా కృషి చేస్తా

ఆర్.పి.ఐ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఇంటింట ప్రచారంలో భాగంగా కన్నేపల్లి మండలం కొత్తపల్లి, రెబ్బెన గ్రామాల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ పర్యటించి ప్రజలతో మాట్లాడారు గ్రామాలలో ఇంకా కుడా బస్,రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి తాను ఎమ్మెల్యే గా గెలిస్తే గ్రామాలకు పెద్ద పీట వేస్తామని అవగాహన కల్పించారు. అనంతరం రెబ్బెన గ్రామంలో యువత ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో మంచి ప్రతిభ కలిగి ఉంటారు కానీ వారికి సరైన వేదిక లేక వారికి ప్రోత్సాహం లేక గల్లికే పరిమితం అవుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు క్రీడా ప్రాంగణం అని ఊరి అవతల ఏర్పాటు చేస్తుంది అవి నిరుపయోగం ప్రతి మండలానికి ఒక పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేసి ఏడాదికి రెండు సార్లు టోర్లమెంట్స్ ఏర్పాటు చేసి ప్రతిభ కనబరిచిన యువతకు రాష్ట్ర, దేశ స్థాయిలో ఉన్నత క్రీడాకారులు గా తీర్చి దిద్దుతా అని హామీ ఇచ్చారు.