వలస ఓటర్లపై అభ్యర్థుల గురి

హైదరాబాద్, ముంబయి, పుణెల్లో భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ముంబయి, పుణె, భివండికి, పిల్లల చదువులు, మెరుగైన జీవనానికి హైదరాబాద్ నగరానికి వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు తీసుకుని. ఆయా ఓటర్ల వివరాలు, చిరునామా తెలుసుకుంటున్నారు. వారికి ఫోన్ లు చేసి ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 30న...