భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించాలి
ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కొరకు వినియోగించనున్న ఈ.వి.ఎం., వి.వి. ప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద రక్షణ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్ అన్నారు. మంగళవారం 004-మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి,...