Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 November 2023, 1:21 pm Posted by : Anjaneyulu Dega

జవాన్ ఆత్మహత్య.?

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరం లో ఓ జవాన్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజిందర్ అనే జవాన్ గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.