ఆ బాణసంచాపై అన్ని రాష్ట్రాల్లో నిషేధమే!

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: బేరియం సహా ఇతర నిషేధిత రసాయనాలతో కూడిన బాణసంచా నిషేధం కేవలం దేశ రాజధాని దిల్లీకి మాత్రమే పరిమితం కాదని.. అది అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపింది. అతి తక్కువ కాలుష్య ఉద్గారాలు, వాయు, శబ్ద కాలుష్యం విడుదల చేసే పర్యావరణహిత బాణసంచాను (Green crackers) మాత్రమే అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొంది....