Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 November 2023, 11:27 pm Posted by : Anjaneyulu Dega

దీపావళి సెలవులో మార్పు చేయండి.. సీఎస్ ను కోరిన టీఎన్జీవో నేతలు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: దీపావళి సెలవు తేదీని మార్చడంతో పాటు పెండింగ్లో ఉన్న మూడు కరవు భత్యాలను వెంటనే విడుదల చేయాలని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. టీఎన్జీవో ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి 2023 జులై ఒకటో తేదీ వరకు తమకు మూడు డీఏలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని సీఎస్ ను కోరారు. దీపావళి పండుగ సెలవును కూడా 13వ తేదీకి మార్చాలని టీఎన్జీఓలు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పాటు అమావాస్య ఉంటుందని, సూర్యోదయం రోజే పండుగ చేసుకుంటారు గనక.. దీపావళి సెలవును 12వ తేదీ నుంచి 13వ తేదీకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.