స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉక్కుమనిషి, దేశ ప్రజలంతా ఒక్కటేనని, మనం భారతీయులమనే భావన తీసుకువచ్చి ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపిన మహామనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ సమైఖ్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రీయ విద్యాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల...