Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 October 2023, 12:03 pm Posted by : Anjaneyulu Dega

బీఆర్ఎస్ దె అధికారం

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వే ల జోరు కొనసాగుతుంది…మొన్నటికిమొన్న సి ఓటర్ సర్వే సంస్థ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబితే…ఇండియా టుడే సంస్థ కాంగ్రెస్, బి ఆర్ యస్ పార్టీలు దగ్గర దగ్గర సీట్లు సంపాదిస్తాయని చెప్పగా ఇండియా టీవీ సంస్థ మాత్రం బిఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందని తేల్చిచెప్పింది. ఇక తాజాగా ఈ సర్వే అంచనాలను తారుమారు చేస్తూ ప్రస్తుత ట్రెండ్ ఇలా ఉంది అంటూ రాజనీతి సర్వే సంస్థ తన సర్వే నివేదికను విడుదల చేసింది. రాజనీతి సంస్థ నిర్వహించిన సర్వేలో 112 సీట్లకు గాను 77 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించనున్నట్లు తేల్చి చెప్పింది. 77 సీట్లు వస్తాయని రాజ్ నీతి సంస్థ సర్వే ద్వారా వెల్లడించింది. ఓట్ల శాతం పరంగా బీఆర్‌ఎస్‌కు 43.35% ఓట్లు పోలవుతాయని అందులో వెల్లడించింది. అక్టోబర్‌ 28 వరకు ప్రజల అభిప్రాయాన్నిసేకరించిన రాజ్‌నీతి.. సర్వే ఫలితాలను సోమవారం ఉదయం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఏడు స్థానాలు మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేని నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌కు పట్టణ ప్రాంతాల్లో 42% రానుండగా.. 50% ఓట్లు, ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక వయస్సుల వారీగా చూస్తే.. 30 ఏండ్ల లోపు వయస్సు ఉన్న ఓటర్లలో 38 % మంది బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపగా, 31 నుంచి 40 వయసు గలవారు 40%, 41-50 ఏండ్లు ఉన్నవారు 48 %, 51-60 ఏండ్ల వయసు వారు 50%, 61 ఏండ్లు పైబడినవారు 51% మంది తాము బీఆర్ఎస్‌కే తమ ఓటని స్పష్టం చేసినట్లు రాజనీతి సంస్థ చెప్పింది.