Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 October 2023, 9:39 pm Posted by : Anjaneyulu Dega

దుబ్బాకలో మావోయిస్టు పోస్టర్లు కలకలం.?

ఆంజనేయులు న్యూస్, సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి దుబ్బాక నుండి దుంపలపల్లి వెళ్లే రహదారిపై బ్రిడ్జిపైన దిమ్మె కు సిపిఐ మావోయిస్టు పేరుతో పోస్టర్ అతికించారు అదేవిధంగా దుంపలపల్లి గ్రామంలో ఓ పౌల్ట్రీ ఫాంకు పోస్టర్ అతికించారు పోస్టర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సం.రాలు కావస్తున్న ఈ ప్రాంతం రైతులు చేనేత కార్మిక కర్షక వర్గం విలవిలలాడుతుందని పోస్టర్ లో రాశారు. అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక యువతకు ఉపాది అవకాశాలు లేక దుబాయి గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అయా రాజకీయ పార్టీల నాయకులు స్వార్థం కోసం పల్లెలను కలుషితం చేస్తున్నారని యువతను మద్యం డ్రగ్స్ బానిసలుగా మారుస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా భూకబ్జాలు, భూ దందాలు చేస్తూ పీడిత ప్రజలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎదిరించిన వారిపై UAPA చట్టం ప్రయోగిస్తూ మర్డర్లు చేస్తున్నారు. మేధావులను యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో గ్రామ, మండల, జిల్లా స్థాయి బీఆర్ఎస్ నాయకులు ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ నాయకులు చెలాయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలంత ఐక్యంగా ఎదుర్కొంటూ-ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు కొనసాగిస్తున్న దోపిడి విధానాలను దౌర్జన్యాన్ని ఆపకపోతే ప్రజల సమక్షంలో శిక్షలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల వారసత్వ సహజ సంపదను బీఆర్ఎస్ రాజకీయ నాయకులు మైనింగ్ మాఫియాకు మారి వారి సొంత ప్రయోజనాలకు కార్పొరేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. యువత మేధావివర్గం కలిసి సహజ సంపదను రక్షించుకోవాలని సూచనలు చేశారు ఈ విధంగా వాల్ పోస్టర్ లో వివరించారు.