Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 October 2023, 1:41 pm Posted by : anjudega

రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ మృతి

ఆంజనేయులు న్యూస్, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్  దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన హాలియా మండలం వెంకటాపురంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చోసుకుంది. వివరాల్లోకి వెళ్తే..యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెంకు చెందిన మధు నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్(ఎస్పీఎఫ్) గా పని చేస్తున్నాడు. కాగా, మధు మోటార్ సైకిల్‌పై నల్లగొండ వెళ్తుండగా అతడి బైక్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధు మృతితో ఆరెగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి..