Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 September 2023, 5:08 pm Posted by : Anjaneyulu Dega

గణనాథుని సేవకై తరలి రావాలి

అంజనీపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మరో రెండు రోజుల్లో వినాయక నిమజ్జనం ఉండడంతో గణపతి పూజ కు తరలి రావాలని మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్ లు వేముల పల్లి సంజీవ్, రామగిరి బానేష్,సల్ల మహేష్ లు పేర్కోన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ లో అంజనీపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ల  ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ కేదారీనాథ్ వినాయకునికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే విశిష్ట పండుగ వినాయక చవితన్నారు.  నియమనిబంధనలు, నిష్టా ఉపవాస దీక్షలతో మనసారా నమ్ముకొని పూజిస్తే భక్తుల కోరికలు తీర్చే దైవమే వినాయకుడన్నారు. అంజనీపుత్ర ఎస్టేట్స్ నిర్వహిస్తున్న నిత్యాన్నదానం, సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు.. అంజనీ పుత్ర ప్రజా శ్రేయస్సుకై వారు తలపెట్టిన ప్రతీకార్యం విజయవంతం కావాలన్నారు.. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.