Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 25 September 2023, 3:30 pm Posted by : anjudega

సేవా కార్యక్రమాలే ధ్యేయంగా ముందుకు :- ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ (ACT)

శశికిరణ్ మంచిర్యాల ప్రతినిధి:

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా  :- పట్టణంలోని తిలక్ నగర్ వద్ద ఉన్న అమృత హస్తం దివ్యాంగుల పురావస కేంద్రం గతంలో వారికి పడుకోవడానికి కనీస సౌకర్యం లేకుండా ఉన్నందుకు, ఫ్లోరింగ్ పనుల కోసము కొంత అమౌంట్ ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ (ACT ) ద్వారా అందచేయడం. అదే సమయంలో భవిష్యత్తులో ఇంకా ఏదైనా వాళ్లకు అవసరమైతే మన ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది.
మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు చేసిన సహాయానికి ప్రేరణ పొంది, చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి సహాయం చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు పునరావాస కేంద్రంలో సభ్యుల సంఖ్య 14 నుంచి 20 కి పెరిగింది. ఇదే క్రమంలో మన ట్రస్ట్ అధ్యక్షుడు మహేందర్ గారి సహ ఉద్యోగులు, వారు మన ట్రస్టు చేపట్టిన సేవా కార్యక్రమాలకు ప్రేరణ పొంది, తమంతట తాముగా మన ట్రస్టు ద్వారా కొంత సహాయం చేద్దామని ముందుకు వచ్చి మన ట్రస్టును సంప్రదించారు. వారు పునరావాస కేంద్రానికి తమవంతుగా ఒక ట్రై సైకిల్ మరియు ఒక రిఫ్రిజిరేటర్ ను మన ACT ద్వారా అందించారు. మరియ మనం చేసినటువంటి సహాయాన్ని పరిపూర్తి చేయడం కోసము వారి పునరావాస కేంద్రం పైకప్పు రిపేర్ల కోసము 15,000/- రూ. నగదు రూపంలో విరాళంగా ఇచ్చాము. అదేవిధంగా మన ట్రస్ట్ సభ్యులు జెట్టి శ్రీనివాస్ గారు కూడా వారి కూతురి జన్మదినోత్సవ సందర్భంగా 5000/- రూపాయలు. మరియు రామకృష్ణాపూర్ నివాసి ఆకునూరి రాజేంద్రప్రసాద్ ప్రత్యూష దంపతుల కుమారుని మొదటి పుట్టినరోజు సందర్భంగా మన ఆక్ట్ ద్వారా అమృత హస్తం దివ్యాంగుల మరియు వయోవృద్ధుల పునరావాస కేంద్రానికి ఐదువేల (5000) రూపాయలు వీరు ఇరువురు తమ సొంతంగా విరాళం ఇవ్వదలుచుకున్నారు. ఈ కార్యక్రమం లో

అధ్యక్షుడు. సట్ల మహేందర్
ఉపాధ్యక్షుడు. కే తిరుపతి
కోశాధికారి . టి సురేష్
ట్రస్టు సభ్యులు. జెట్టి శ్రీనివాస్. ఈ. వెంకటేష్, కే .సంపత్, మరియు అశోక్ పాల్గొన్నారు.