Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 September 2023, 6:55 pm Posted by : Anjaneyulu Dega

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల వడబోత కొలిక్కి వచ్చేనా.?

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఢిల్లీ వేదికగా సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశం శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాగా, అభ్యర్థుల ఎంపికపై నిన్న, ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. 60 శాతానికి పైగా ఏకాభిప్రాయంతో అభ్యర్థుల జాబితా కొలిక్కి కాగా, 40 శాతం అభ్యర్థుల జాబితాపై మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. టికెట్ కేటాయింపులపై వార్ రూంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వాడీవేడి వాదనలు జరిగినట్లు సమాచారం. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా ఈ అభ్యర్థులను ఎంపిక చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా కీలక నేతలంతా పాల్గొన్నారు…