ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

మంచిర్యాల  జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ భూములను ఆక్రమించినా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లాగా ఏర్పడటంతో పాటు అభివృద్ధిలో జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, 311 గ్రామపంచాయతీలు ముందంజలో ఉన్నాయి. భూముల విలువ పెరగడంతో కొందరు ఆక్రమణదారులు అక్రమంగా ప్రభుత్వ భూములలో చొరబడి తప్పుడు పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని నస్పూర్ మండలం నస్పూర్...