Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 September 2023, 5:05 pm Posted by : Anjaneyulu Dega

భూకబ్జాదారులపై కేసులు నమోదు చేయాలి

గుడిసెలు వేసుకున్న పేదలకు రక్షణ కల్పించాలి.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం రోజున అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోమాస ప్రకాష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా చెన్నూరు బావురావు పేట శివారు సర్వే నెంబర్ 8 లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిలో నిరుపేదలైన ప్రజలు గత ఐదు నెలలుగా గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఓర్వలేని కొంతమంది ఆ భూమిని కబ్జా చేసిన భూకబ్జాదారులు ఈరోజు ఉదయం  ఉదయం 9 గంటలకు పేదల వేసుకున్న గుడిసెల్ని 200 మంది రౌడిలతో, గుండాలను పంపి ట్రాక్టర్లతో గుడిసెలను కూల్చి, పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అడ్డుపోయిన మహిళలపై కూడా దాడులు చేసి, ఇష్టం వచ్చినట్టు చెడు మాటలతో తిట్టినారు. చెన్నూరు నడిబొడ్డులో ఇంత దాష్టీకానికి పాల్పడిన భూ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలి. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అక్రమ పట్టాలను వెంటనే రద్దుచేసి, గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి.ఆ పేదలకు రక్షణ కల్పించాలి. లేకుంటే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని  డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో దుంపల రంజిత్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.