ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో 18 సం||లు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2వ ఓటరు జాబితా సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం-2023లో భాగంగా నూతన ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ఓటరు నమోదు అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, ఆయా మండలాల తహశిల్దార్లు...