Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 August 2023, 9:19 pm Posted by : Anjaneyulu Dega

కాంగ్రెస్ టికెట్ కోసం డాక్టర్ రాజా రమేష్ దరఖాస్తు

చెన్నూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టికెట్ బరిలో డాక్టర్ రాజా రమేష్ గాంధీ భవన్ లో దరఖాస్తు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం బుదవారం రోజున హైదరాబాద్ గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి తో, రేవంత్ రెడ్డి అన్న గారు మరియు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతో దరఖాస్తు పెట్టుకున్న చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్.. ఈ సందర్బంగా రాజా రమేష్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరి దీవెనలతో ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు… ఇటు మందమర్రి కార్మిక క్షేత్రం లో విపరీతమైన ఆదరణ ఉన్న ఒక వైద్యుడిగా సేవకుడిగా కార్మికులు అధికారులు కార్మిక పరిసర ప్రాంత ప్రజలు వెంట ఉన్నారని అటు జైపూర్ భీమారం చెన్నూరు కోటపల్లి మండలాల్లో రైతులు వారి కుటుంబాలు యువకులు స్థానికేతరుడు అయిన ఎమ్మెల్యే పని తీరు ని వ్యతిరేకిస్తూ ప్రవర్తనపై విరక్తి చెంది ఖచ్చితంగా నన్ను ఆదరించి గెలిపిస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.. కాంగ్రెస్ అధిష్టానం నమ్మి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను అని విద్య, వైద్యం, ఉపాధి, రైతాంగానికి, చిరు వ్యాపారస్తులకు ఖచ్చితమైన న్యాయం చేస్తానని తెలియచేశారు.. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి. రాజయ్య, మందమర్రి మండల అధ్యక్షుడు కడారి.జీవన్, భీమారం మండల అధ్యక్షుడు వెంకన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బానేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్, హరీష్, తిరుపతి, హరినాథ్ పాల్గొన్నారు..