కార్యకర్తలపై పడి ఏడ్చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఆంజనేయులు న్యూస్, జనగామ జిల్లా: స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ తనకే వస్తుందని ఆశించి భంగపాటుకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం తన మద్దతుదారులతో సమావేశమై రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర మనోవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. జనగామలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్షంలోనే తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందుకు పడుకుని విలపించారు. ఆ తరువాత తన వద్దకు వచ్చిన కార్యకర్తలపై పడి ఎమ్మెల్యే ఏడ్చేశారు. అందరూ సంయమనం కోల్పోకుండా ఓపికతో పనిచేయాలని రాజయ్య సూచించారు. కార్యకర్తలందరూ సమన్వయం...