
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని రామకృష్ణపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఆకోజు రామకృష్ణ కు పాప మరియు బాబు ఉన్నారు. బాబు (నిహాన్) కి 2 సంవత్సరాల అప్పుడు అనారోగ్య సమస్య వలన అతనికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అతని తల్లి తనకు లివర్ దానం చేసి కొడుకు ప్రాణాలని కాపాడుకుంది. దాతలు, స్వచ్చంధ సంస్థ ల ద్వారా వచ్చిన డబ్బుతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకోగలిగారు. ఆ బాబు ప్రస్తుతం మళ్లి ఊపిరితిత్తుల వ్యాధితో రెయిన్ బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. లక్షల్లో ఖర్చు వస్తుంది అని డాక్టర్లు తెలపగా ఏమి తోచని స్థితిలో స్వచ్ఛంద సంస్థలకి సమాచారం తెలియచేసారు. విషయం తెలుసుకున్న మన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ వారు తమ వంతు సహాయంగా 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసి బీద ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు సట్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి సంపత్, ఉపాధ్యక్షులు కయ్యం తిరుపతి, ట్రెజరర్ తూముల సురేష్, ప్రచార కార్యదర్శి బండారి భూమేష్, అసిస్టెంట్ సెక్రటరీ జెట్టి శ్రీనివాస్, అల్లం కుమార్, సభ్యులు కే. సంపత్, బి. తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని ఆలోచన ఉన్న దాతలు మా ఆత్మీయ ట్రస్ట్ ను 8333026056 సంప్రదించగలరు…