విమానం గుల్ల.. అత్యవసర ల్యాండింగ్..!
ఆంజనేయులు న్యూస్: ఇటలీలోని మిలన్ నుంచి అమెరికా లోని న్యూయార్క్ జేకేఎఫ్ ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం తీవ్రంగా దెబ్బతిని రోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. డెల్టా ఎయిర్‌లైన్స్ కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉంది. కానీ, ప్రయాణం ఆరంభించిన 15 నిమిషాల తర్వాత తీవ్రమైన వడగళ్లు, పిడుగులతో కూడిన వానలో చిక్కుకుంది. దీంతో విమానం ముక్కు, రెక్కలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. విమానాన్ని నియంత్రించడం పైలట్లకు ఇబ్బందికరంగా మారింది....