మీరు ఎవ్వరు..? మీరేమైనా మినిస్టరా..?

మంత్రి సబితారెడ్డి కుమారుడు ట్వీట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు... ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది. మంత్రి స్పందించలేదు కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న రేంజ్‌లో వెటకారంగా రిప్లై ఇచ్చాడు. అంతే.....