Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 July 2023, 5:55 pm Posted by : Anjaneyulu Dega

మందమర్రి లో అభివృద్ధి శూన్యం

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డా॥ రాజా రమేష్ బాబు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చెన్నూర్ నియోజకవర్గంలోని కొల్ బెల్ట్ ప్రాంతం అయిన మందమర్రి లోని శ్రీపతి నగర్ లో శనివారం చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డా॥ రాజా రమేష్ బాబు పర్యటించి రోడ్లను, డ్రైనేజ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డా॥ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ.  మందమర్రి మునిసిపాలిటీ  శ్రీపతి నగర్ లో డ్రైనేజీ సమస్య వలన ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో స్థానిక పెద్దలు కాంగ్రెస్ అభ్యర్ధి రాజా రమేష్ ని సమస్య వివరించగా వారు వెంటనే స్పందించి అక్కడికి వచ్చి సమస్య పరిశీలించి మునిసిపాలిటీ సిబ్బంది తో చర్చించి తన సొంత ఖర్చు లతో డ్రైనేజీ సమస్యను పూర్తి చేస్తానని స్థానిక పెద్దలకు మాట ఇవ్వడం జరిగింది. దశాబ్ది BRS పాలనలో చెన్నూర్ నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయని విమర్శించారు. తెలంగాణ కె తలమాణికంగా ఉన్న సింగరేణి ప్రాంతంలో కార్మికులు నివాసం ఉండే కాలనీలు అభివృద్ధికి నోచుకోక పోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రపంచానికి వెలుగులు అందించే సింగరేణి కార్మికులు స్లమ్ ఏరియాలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే మందమర్రి ని మునిసిపాలిటీ గా ఏర్పాటు చేసి  మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి అభివృద్ధి చేస్తాం అని హామి ఇచ్చిన బాల్క సుమన్ మాటలు ఉత్తవే అయ్యాయని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టలేని నాయకులను, రాజకీయ పార్టీలను రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మండల అధ్యక్షులు కడారి జీవన్, టౌన్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు హరీష్, చంద్రయ్య, గజ్జి సతీష్, బూర్గుల మోగిళి, మల్లయ్య, యువకులు శ్రీకాంత్ రాజు శివ తదితరులు పాల్గొన్నారు.