మా ఆయనే వదిలేయండి.. పీఎస్ కు వెళ్లి బతిమిలాడిన మహిళా ఎస్ఐ
అతడిని వదిలేసి మరో ముగ్గురు నిందితులపైనే కేసు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నేరం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు.. తమ అనుకున్న వారిని మాత్రం వదిలేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆర్జీఐఏ ఠాణాలో నకిలీ సర్టిఫికెట్ల దందాలో ప్రమేయమున్న వ్యక్తి పేరు బయటపడకుండా చేసిన వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ. నిందితుడు ఒక మహిళా ఎస్ఐ భర్త కావడమేనన్న ఆరోపణలొస్తున్నాయి. అసలు కేసు ఇదీ.. మూడు నెలల క్రితం శంషాబాద్ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి నాగేశ్వరరావు దూరవిద్యలో ఎంఎస్సీ కోర్సు...