అర్హులైన రైతులందరికీ రూ.లక్ష రుణమాఫీ

2023-24 బడ్జెట్ లో రూ.6,325 కోట్ల కేటాయింపు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రైతుబంధు నిధులను వారి రుణ ఖాతాల్లో జమ చేయొద్దని ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. సచివాలయంలో సోమవారం వ్యవసాయశాఖపై ఆయన సమీక్షించారు. 'ఇప్పటి వరకు 5,42,635 మంది రైతులకు చెందిన...