Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 11 July 2023, 10:24 pm Posted by : Anjaneyulu Dega

మసాజ్ ముసుగులో వ్యభిచారం.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసీ నిర్వాహకులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో ఉన్న స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేశారు. కేంద్రం నడుపుతున్న వ్యక్తి తో పాటు నలుగురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్‌లోని ప్రముఖుల కుమారులేనని సమాచారం. సహ ఆర్గనైజర్ సయ్యద్ బిల్లాల్‌తో పాటు ఫహద్, హసీదుద్దీన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఐదుగురు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధికారులు వారిని రెస్క్యూ హోంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే క్రమంలో మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లో ఉన్న మహి ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా సెలూన్‌పై కుడా ఈ రోజు ఉదయం  పోలీసులు దాడి చేశారు. సునీల్ కుమార్ అనే వ్యక్తి వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా అక్కడ క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. క్రాస్ మసాజ్ పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్గనైజర్ సునీల్ కుమార్ తో పాటు సబ్ ఆర్గనైజర్ గా పనిచేస్తున్న ఫర్జానా బేగంపై పోలీసులు కేసు నమోదు చేశారు..