Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 11 July 2023, 10:18 pm Posted by : Anjaneyulu Dega

డబుల్ బెడ్రూమ్ మొసం

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్ పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని అమాయకులను మొసం చేసిన ఘరానా మొసగాడు చివరికి పోలీసులకు చిక్కాడు. మంగళవారం కౌటాల మండలం బాలాజీ అనుకోడకు చెందిన బాదితుడు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు లక్షలు ఇస్తే డబుల్ బెడ్ రూమ్ తమ పేరు మీద అందజేస్తామని విజయ్ సాగర్ అనే వ్యక్తి నమ్మబలికాడు. 4 లక్షలు ఇచ్చినా మరో లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమొదు చేశారు.