ఆడిట్ లోను అవకతవకలు!

ఖర్చయిన నిధుల్లో 3 శాతం చెల్లిస్తే అంతా సరే కాగజ్నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో అడిట్ చేస్తున్న అధికారులు ఆంజనేయులు న్యూస్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్  పంచాయతీలకు కేంద్ర, రాష్ట్రాలు విడుదల చేసిన నిధులు, సమకూరిన ఆదాయాల్లో నయాపైసా పక్కదారి పట్టకూడదని, పనుల్లో పారదర్శకత పాటించాలనే ఆశయంతో సర్కారు ఆడిట్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి పంచాయతీ ఆదాయాల వ్యయాలపై సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఖర్చయిన నిధులు, వాటి తాలుకూ బిల్లుల్లో తేడా వస్తే నిధులు దుర్వినియోగమైనట్లు ఆడిట్ అధికారులు పరిగణనలోకి...