వైద్యం వికటించి పసికందు మృతి
ఆసుపత్రి ముందు పసికందు మృతదేహంతో భైఠాయించిన కుటుంబ సభ్యుల ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కృష్ణమందిర్ రోడ్డులో ఉన్న నిత్య పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడు నెలల పసికందు మృతిచెందింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం ఐబీ ప్రాంతంలోని కొత్త గుడిసెల ప్రాంతానికి చెందిన కళావతి, జైకిషన్ దంపతుల మూడు నెలల పసికందు అనారోగ్యం బారిన పడటంతో నిత్య పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబు జలుబుతో బాధపడుతున్నాడని వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డి, సిబ్బంది కలిసి నోటి ద్వారా...