నేతల అండ.. అక్రమ దందా

జిల్లాలో అనుమతుల్లేకుండా ఇసుక తరలింపు ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: జిల్లాలోని వాగులు, గోదావరి తీర ప్రాంతం ఇసుకాసురులకు కాసుల పంట పండిస్తోంది. కొంతమంది నేతల అండతో ఈ దందా జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ అనధికార టెండర్లు నిర్వహించి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇసుకను చూసి రూ.5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పాటపాడి రవాణా చేస్తుండగా.. మరికొన్ని చోట్ల అధికారులను ప్రసన్నం చేసుకుని రాజకీయ పార్టీ ప్రతినిధులే సూత్రధారులుగా వ్యవహరిస్తూ దర్జాగా తరలిస్తున్నారు. సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో...