ఆగని అక్రమం.. చర్యలు శూన్యం..

బెల్లంపల్లి షంషీర్ నగర్ లో నిర్మించిన గదులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. రెవెన్యూ యంత్రాంగం అక్రమ కట్టడాలు కూల్చిన చోటే దర్జాగా మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు ట్రాక్టర్లతో కూల్చివేసినప్పటికీ నిర్మాణాలు మళ్లీ యథావిధిగానే కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం కబ్జాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నా అవేమీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. పట్టణంలోని షంషీర్ నగర్ లో ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం కొనసాగుతోంది. గతంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలు పూర్తి...