పరీక్షలు చేసేవారేరి..?

మంచిర్యాలలో టీ-హబ్ ఇంకా నియామకాలు చేపట్టని వైనం ప్రారంభానికి సిద్ధమైన జిల్లా కేంద్రంలోని టీ-హబ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో టీ-హబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. కానీ సిబ్బంది. నియామకమే ఇంకా పూర్తి కాలేదు. కీలక విభాగమైన ల్యాబ్ టెక్నీషియన్ల (ఎల్టీ) నియామకం ఊసే లేదు. జిల్లాలోని ఆసుపత్రుల్లో వీరి కొరత తీవ్రంగా ఉంది. ఒక్కొక్కరు రెండేసి ఆరోగ్యకేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా పలు కేంద్రాల నుంచి ఏడుగురు ఎల్టీలను ఈ టీ- హబ్ లో విధులు...