అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. తితిదే కీలక నిర్ణయాలు
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఆంక్షలు విధించిన టీటీడీ ఆంజనేయులు న్యూస్, తిరుమల: అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం తితిదే ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసింది పిల్ల చిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లి...