Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 June 2023, 2:16 pm Posted by : Anjaneyulu Dega

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

మంచిర్యాల ఆర్టీసీ డిఎం రవీందర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆర్టీసీ ఉన్నత అధికారుల ఆదేశానుసారం తేదీ 18-06-2023 నుండి T9 (60) టికెట్ ప్రవేశపెట్టనున్నట్లు శనివారం మంచిర్యాల డిపో మేనేజర్ రవీందర్ ప్రకటనలో తెలిపారు. T9 టికెట్ ద్వారా మహిళలు మరియు సీనియర్ సిటిజన్స్ ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు 60 కి. మీ లోపు ప్రయాణం చెయ్యవచ్చు. T 9 టికెట్ రూ. 100 కి ప్రతి కండక్టర్ వద్ద లభిస్తుంది. T9 తో ప్రయాణం వలన 20 నుండి 40 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు అన్నారు.