
ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: కుక్కను చంపి మాంసం విక్రయించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాహుల్ కైక్వాడ్ తెలిపారు. ఆయన కథన కారం.. లక్ష్మణ మండల కేంద్రానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఇటీవల దొంగతనానికి గురైంది. స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా మండలంలోని పొట్టపెల్లి (కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్ చామన్ పెల్లి గ్రామానికి చెందిన వరుణ్ అనే వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. వారిని విచారించగా కుక్కను చంపి జింక మాంసం పేరుతో విక్రయించినట్లు తెలిపారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.